చెవిలో పువ్వులతో బీఆర్ఎస్ వినూత్న నిరసన

మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయుడి విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 420 రోజులు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నాడు ఎన్నికలలో అలవికాని 420 హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని పూర్తిచేయని నేపథ్యంలో ముషీరాబాద్ లోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద మాజీ కార్పొరేషన్ చైర్మన్ గేల్లు శ్రీనివాస్ యాదవ్ తో కలిసి నిరసన కార్యక్రమంలో భాగస్వామ్యమై కాంగ్రెస్ చేసిన మోసాన్ని, ఎన్నికల్లో పంచిన గ్యారెంటీ కార్డులకు, ఇచ్చిన 420 హామీలను పాత రేసి ప్రజలకు చెవిలో పువ్వులు పెడుతూ, అటెన్షన్ డైవర్షన్ డ్రామాలతో కాలం వెళ్లదీస్తున్న వైనాన్ని ఎండగట్టిన మాజీ కార్పొరేషన్ చైర్మన్ డా.కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి.
అబద్ధపు హామీలను నమ్మిన ప్రజలు అధికారంలోకి వచ్చిన 420 రోజుల్లో రోజుకో రైతు చొప్పున 412 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు.420 రోజుల్లో దాదాపు 100 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు.గురుకులాల్లో కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కల్తీ ఆహారం తిని 55 మందికి పైగా విద్యార్థులు దుర్మరణం పాలయ్యారు.నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు సంవత్సరానికి రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వం.కాంగ్రెస్ పాలనలో ఆడపడుచుకు బతుకమ్మ చీరలు లేవు.
చేనేతలకు ఉపాధి లేదు కాంగ్రెస్ ప్రభుత్వం అధికరాంలోకి వచ్చిన 420 రోజుల్లో 30 మందికి పైగా చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు.అసలు మాహత్మ గాంధీ పేరుతో గద్దెనెక్కిన డూప్లికేట్ గాంధీలు ఇచ్చిన దొంగ హామీలు వైఫల్యాలను ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.ఇట్లా అన్ని వర్గాలను ఉద్యోగ, ఉపాధ్యాయ, నిరుద్యోగ, రైతులను, ప్రజలను మోసం చేసిన, దగా చేసిన కాంగ్రెస్ ప్రభుత్వనికి జ్ఞానోదయం కలిగించు ఓ మహాత్మా.42 హామీలను నమ్మి ఓటేసిన పాపానికి గొంతు కోసిన ఈ అసమర్ధ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఇప్పటికైనా మంచి బుద్ధి ప్రసాదించాలని మహాత్మా గాంధీని వేడుకున్నారూ.
