బీఆర్ఎస్ ది తప్పు అయితే కాంగ్రెస్ ది తప్పే..!
సహాజంగా శత్రువును జయించాలంటే రచించిన ప్రణాళిక.. వేసిన వ్యూహాం చాలా పకడ్బంధిగా ఉండాలని పెద్దలు అంటుంటారు. అదే రాజకీయాల్లో అయితే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ విషయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఫెయిల్ అవుతున్నారని అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేతలు ఆందోళన చెందుతున్నట్లు గాంధీ భవన్ వర్గాలు కోడై కూస్తున్నాయి.
అధికారంలోకి వచ్చిన మొదటిరోజునే కాళేశ్వరంలో అవినీతి జరిగింది. మిషన్ భగీరథలో ప్రజల సొమ్మును మింగేశారు. మిషన్ కాకతీయలో వేలకోట్లను కాజేశారు. కరెంటు కొనుగోలులో భారీ అవినీతి జరిగింది అని ఇలా నెలకో అంశాన్ని నెత్తిన పెట్టుకున్నారు అధికార కాంగ్రెస్ నేతలు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు కంటే బీఆర్ఎస్ పదేండ్ల పాలనను అవినీతిమయంగా చిత్రీకరించడమే పనిగా పెట్టుకున్నారు.
ఆ తర్వాత ఇవన్నీ నిలబడలేదని ఏకంగా ఫార్ములా ఈరేసు కారు ఉదంతాన్ని ముందరేసుకునున్నారు. అప్పటి క్యాబినెట్ ఆమోదం తీసుకోలేదు.. ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదన్న ఒకే ఒక కారణంతో యాబై నాలుగు కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ముందరేసుకుని మరి ఏసీబీ,ఈడీలను రంగంలోకి దింపింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి.
ఇది కూడా కోర్టు ముందర నిలబడలేకపోయేసరికి ఏకంగా ఎలక్టోరల్ బాండ్స్ అంటూ సరికొత్త అంశాన్ని మళ్లీ ముందరేసుకున్నారని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నారు. సహాజంగా మన దేశంలో ప్రతి రాజకీయ పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఉంటాయి. ఈ అంశం గురించి బీఆర్ఎస్ నేతలు స్పందిస్తూ గ్రీన్‌కో కంపెనీకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఫార్ములా-ఈ కోసం ఎలాంటి కాంట్రాక్టు కానీ, డబ్బు కానీ ఇవ్వలేదు. ఉల్టా ఫార్ములా-ఈ స్పాన్సర్‌గా గ్రీన్‌కో కంపెనీనే తన సబ్సిడరీ సంస్థ ద్వారా సుమారు రూ. 100 కోట్ల వరకూ వెచ్చించింది.
గ్రీన్‌కో నుండి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకోవడం తప్పైతే కాంగ్రెస్, బీజేపీలు కూడా ఆ కంపెనీ నుండి ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నాయి మరి!.ఇంకో విషయం. ఎలక్టోరల్ బాండ్స్ అనేవి భారత ప్రభుత్వం రాజకీయ పార్టీలకు పారదర్శకంగా విరాళాలు ఇవ్వడానికి తెచ్చిన ఒక విధానం. మరి అలాంటప్పుడు అది అసలు తప్పు ఎట్లా అవుతుంది?.
కాంగ్రెస్ పార్టీ ఇప్పటి దాకా వివిధ సంస్థల నుండి సుమారు రూ 1500 కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ పొందింది. సో! కాంగ్రెస్ కూడా తప్పుచేసినట్టేనా? అని వాళ్లు ప్రశ్నిస్తున్నారు.అయినా ఫిబ్రవరి 2024 నుంది ప్రజాబాహుళ్యంలో ఉన్న సమాచారం ఇవ్వాళే కొత్తగా కనుక్కున్నట్టు రేవంత్ ప్రభుత్వం హడావిడి చేయడం కేవలం ఇవ్వాళ మీడియా మేనేజ్మెంట్ కోసమే అని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు.