బీఆర్ఎస్ ఎమ్మెల్యే అరెస్ట్..!

brs mla arrest
బీఆర్ఎస్ పార్టీకి చెందిన హుజూర్ బాద్ శాసన సభ్యులు పాడి కౌశిక్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ మహానగరంలోని జూబ్లీహిల్స్ 10టీవీ ఆఫీస్ వద్ద కరీంనగర్ కు చెందిన పోలీసులు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతరం ఆయన్ని కరీంనగర్ కు తరలించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. టెన్ టీవీలో ఇంటర్వూ ముగించుకుని ఇంటికి బయలు దేరే సమయంలో అరెస్ట్ చేసినట్లు సమాచారం.
