నడి రోడ్డుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు- తీవ్ర ఉద్రిక్తత
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాజీ సర్పంచులు తమ పెండింగ్ బిల్లులను విడుదల చేయాలని నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చిన సంగతి తెల్సిందే.
ఈ క్రమంలో రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని తిరుమల గిరి పీఎస్ లో అరెస్ట్ చేసి ఉంచిన మాజీ సర్పంచులకు సంఘీభావంగా మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, వేముల ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు తిరుమల గిరి పీఎస్ కు చేరుకున్నారు.
అరెస్ట్ చేసి సర్పంచులను తరలిస్తున్న పోలీసు వాహానాలను అడ్డుకుని నడిరోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ఆ వాహానాలను అడ్డుకున్నారు.