అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నిరసనలు..!
సోమవారం ఉదయం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలో నిరసనలు చేపట్టారు. ఇటీవల కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో గిరిజన రైతులకు భేడీలు వేయడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఖండిస్తూ అసెంబ్లీ ప్రాంగణంలో నిరసనలు చేపట్టారు.
రైతులకు బేడీలు సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ నిరసనలు చేస్తున్న వారిని పోలీసులు అడ్డుకున్నారు.
రైతులపై ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ ప్రభుత్వ వైఖరిని ఖండించారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు,ప్రశాంత్ రెడ్డి,కమలాకర్ లతో పాటు ఆ పార్టీ ఎమ్మెల్యేలందరూ పాల్గోన్నారు.