కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై వేటు వేయాలి- కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి..
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు.
మీడియాతో మాట్లాడుతూ ” బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలపై వేటు వేయాలి.. పిరాయింపుల విషయంపై నా అభిప్రాయం మారదు..
ఇన్నేండ్ల నా అనుభవం ప్రశ్నార్థకంగా మారింది. కాంగ్రెస్ పార్టీలో ఉన్న నిఖార్సైన వాళ్లకు సరైన న్యాయం జరగడం లేదు. కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలంటే ఈ నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచించారు.