బీఆర్ఎస్ కొత్త బాస్ పై సీనియర్ నేత దేవిప్రసాద్ క్లారిటీ..!
Politics : మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ ” కొత్త ఏడాదిలో బీఆర్ఎస్ అధ్యక్ష ఎన్నిక ఉంటుంది.. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి.. జిల్లా స్థాయి.. నియోజకవర్గ స్థాయి.. మండల స్థాయి.. గ్రామ స్థాయికి సంబంధించిన అన్ని రకాల కమిటీలు ఏర్పాటు చేసుకుంటాము.. ఏఫ్రిల్ ఇరవై ఏడో తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా భారీ బహిరంగ సభ ఉంటుందని చెప్పిన సంగతి మనకు తెల్సిందే.
తాజాగా గులాబీ బాస్ గురించి ఆ పార్టీ సీనియర్ నాయకులు.. ఉద్యమ నేత దేవి ప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ క్లారిటీచ్చారు. తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ హారీష్ రావు ,కేటీఆర్ లు ఇద్దరు పెద్ద నాయకులు.. జనంలో పలుకుబడి .. జనాధరణ ఉన్న నాయకులు.. హారీష్ రావు మొదటి నుండి చెబుతూనే ఉన్నారు..
నేను ఒక నిజాయితీ గల నిబద్ధత ఉన్న కార్యకర్తను.. కేసీఆర్ గారు ఏ బాధ్యత అప్పజెప్పిన ఆ బాధ్యతను వందకు వందశాతం న్యాయంగా నెరవేరుస్తాను అని.. హారీష్ రావు గారిని రోజూ మీడియా ఏదోక పరీక్ష పెడుతుంది. ఇక కేటీఆర్ గారి విషయానికి వస్తే వారు ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. అధ్యక్ష ఎన్నికలు జరిగినప్పుడు వేసే నామినేషన్ల బట్టి అధ్యక్ష ఎన్నిక ఉంటుందని ఆయన అన్నారు.