బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు

BRS Party
అసెంబ్లీ ఎంపీ ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ నేతల ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదు అని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అన్నారు.. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ” గత రెండు ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పిన బీఆర్ఎస్ కు బుద్ధి రాలేదు..
స్థానిక సంస్థల్లో కూడా బీఆర్ఎస్ కు గుణపాఠం తప్పదు.. కాంగ్రెస్ పాలనలో ప్రజలంతా ఆనందంగానే ఉన్నారు.. కేసీఆర్ కుటుంబానికే కష్టాలు వచ్చాయి .
అధికారం పోయిందన్న బాధతో బీఆర్ఎస్ నేతలు ఏదో ఏదో మాట్లాడుతున్నారు.. కేసీఆర్ నాడు ప్రజలను కలవలేదు.. నేడు అసెంబ్లీ కు రావడం లేదని తీవ్ర పదజాలంతో ఆగ్రహాం వ్యక్తం చేశారు.
