తన మూలాలను గ్రహించిన బీఆర్ ఎస్..సత్ఫలితం ఉంటుందా..?
బీఆర్ఎస్ అయిన అప్పటి టీఆర్ఎస్ అయిన ముందుగా గుర్తుకు వచ్చేది ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా జలవిహార్ లో పురుడుపోసుకున్న పార్టీ అని ఠక్కున అందరి మదిలో మెదులుతుంది. అంతటి మహోత్తర చరిత్ర .. మూలాలు ఉన్న బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చాక తనమూలాలను మరిచిపోయి అధికారమే పరామవదిగా కాంగ్రెస్ టీడీపీ లకు చెందిన ఎమ్మెల్యేలను.. నేతలను చేర్చుకుని ఉద్యమ పార్టీ కాస్తా పక్క పొలిటికల్ పార్టీగా అవతరించింది. పదేండ్లలో డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో ఏ పార్టీ .. ఏప్రభుత్వం చేయని పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేస్తూ కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని దేశానికే దిక్సూచిగా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ.. గులాబీ దళపతి కేసీఆర్..
అయితేనేమి ఇటీవల జరిగిన ఎమ్మెల్యే ఎన్నికల్లో అధికారాన్ని దూరం చేశారు.. లోక్ సభ ఎన్నికల్లో జీరోకు పరిమితం చేశారు ఓటర్లు.. ప్రజలు.. అయితే ఈ ఓటమికి ప్రధాన కారణం నిరుద్యోగ యువత.. యువతరం అని త్వరగానే గ్రహించినట్లు ఉంది బీఆర్ఎస్ అధినాయకత్వం.. అందుకే గ్రహించిందే తడవుగా నాడు ఉద్యమంలో బీఆర్ఎస్ కు పట్టుకొమ్మగా నిలిచిన విద్యార్థి,యువతరం నాడిని పట్టుకుని తాజాగా వారికి మద్ధతుగా ఉద్యమాలు.. ధర్నాలు చేస్తుంది . మొన్న టీజీపీఎస్సీ ముట్టడి అయిన నిన్న ఓయూలో ధర్నాలు అయిన బీఆర్ఎస్వీ తమ అధినాయకుడి ఆదేశాల మేరకు విజయవంతం చేశారనే అనుకోవచ్చంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అధికారం పోవడానికి ఎవరూ అయితే కారణమయ్యారో వారి సమస్యలపై కొట్లాడటం బీఆర్ఎస్ పై ఉన్న వ్యతిరేకతలో కొంతమేరకు తగ్గుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు…
అత్తారింటికి దారేది మూవీలో హీరో పవన్ కళ్యాణ్ బ్రహ్మానందాన్ని ఉద్ధేశించి ఓ డైలాగ్ “దేంతో మొదలయ్యావో దాంతోనే చివరికి మిగిలుతావు” అని అన్నట్లు నాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి & టీమ్ నిరుద్యోగులను..యువతను అడ్డుపెట్టుకుని బీఆర్ఎస్ ప్రభుత్వంపై కొట్లాడారో తీరా అధికారంలోకి వచ్చాక వారిని పక్కనపెట్టడం కాంగ్రెస్ పార్టీకి మైనస్ అవుతుంది.. యువతరం.. నిరుద్యోగులు తలచుకుంటే ప్రభుత్వాలే కూలిపోతాయి.. రాజకీయ సమీకరణాలు మారిపోతాయని గతంలోనే తమకు అనుభవమైన కానీ నిర్లక్ష్యం చేయడం మున్ముందు ప్రస్తుత ప్రభుత్వ మనుగడకు సమస్యగా మారుతుందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఉద్యమంలో ఎవరైతే తమకు అండగా ఉన్నారో ఆ వర్గాలైన యువత.. నిరుద్యోగుల న్యాయబద్ధమైన డిమాండ్లు డీఎస్సీ పోస్టులు పెంచాలి.. డీఎస్సీ గ్రూపు-1 పరీక్షకు కనీసం రెండు నెలలు గ్యాప్ ఉండాలని కోరడం సబాబే అని న్యూట్రల్ పీపుల్స్ తో పాటు కామన్ పబ్లిక్ అనుకునేలా బీఆర్ఎస్ శ్రేణులు వారి సమస్యలపై పోరాడటం .. రోజు ఏదోక సమస్యను నెత్తినపెట్టుకుని ఉద్యమాలు చేయడం ఆ పార్టీ మూలాలను త్వరగానే గ్రహించింది.. ఇలాగే ప్రజలకు దగ్గరయ్యే ఉద్యమాలతో.. కార్యక్రమాలతో ముందుకెళ్తే అధికార పార్టీపైవ్యతిరేకత రావడమే కాకుండా మున్ముందు జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు.. మున్సిపల్ ఎన్నికల్లో ఆ తర్వాత నాలుగేండ్లకో ఐదేండ్లకో వచ్చే ఎన్నికల్లోపు బీఆర్ఎస్ పార్టీ మునుపటి ప్రభావాన్ని తెచ్చుకోని అధికారం చేపడుతుందనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.. ఎందుకంటే ఇప్పటికే అన్ని వర్గాల్లో కాంగ్రెస్ పై అసహానం పెరగడమే కాకుండా ఇచ్చిన ఏ ఒక్క హమీను నెరవేర్చకపోవడం.. బీఆర్ఎస్ తన మూల సిద్ధాంతమైన ఉద్యమ పంథాన్ని ఎంచుకోవడం మున్ముందు గులాబీ దళానికి సత్ఫలితాలు ఇవ్వడం ఖాయమంటున్నారు పొలిటికల్ క్రిటిక్స్.