మాజీ మంత్రి కేటీఆర్ తో సహా పలువురు బీఆర్ఎస్ నేతలపై కేసు నమోదు
తెలంగాణ ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెట్ కేటీఆర్ తో సహా ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే..మాజీ ఎంపీలపై కేసు నమోదు అయింది .ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర గీతం..చిహ్నాం మార్చాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెల్సిందే.
దీంతో వరంగల్ జిల్లా కేంద్రంలో కోట దగ్గర మీడియా సమావేశం నిర్వహించి, నిరసన తెలిపిన మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, మాజీ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్, నన్నపనేని నరేందర్, పెద్ది సుదర్శన్ రెడ్డి, హన్మకొండ జడ్పీ చైర్మన్ సుధీర్ కుమార్, ఖమ్మం- వరంగల్-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి, మాజీ కుడా చైర్మన్ యాదవరెడ్డి ఇతర, బీఆర్ఎస్ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు.
తాజాగా నిన్న హైదరాబాద్ లోని చార్మినార్ వద్ద నిరసన తెలిపిన బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్, పొన్నాల లక్ష్మయ్య, పద్మారావు గౌడ్, మాగంటి గోపినాథ్ మరియు ఇతర నాయకుల మీద సెక్షన్ 188 కింద కేసు నమోదు చేశారు చార్మినార్ పోలీసులు.