రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదు…?
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై ఏపీలోని ప్రకాశం జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహాం మూవీ సినిమాలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , మంత్రి నారా లోకేష్ నాయుడు, ఆయన సతీమణి నారా బ్రాహ్మణి లను కించపరిచేలా దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పోస్టులు పెట్టారు.
ఈ విషయంపై టీడీపీ నేత ఎం రామలింగం పిర్యాదు చేశారు. దీంతో మద్దిపాడు పీఎస్ లో ఐటీ చట్టం కింద ఆర్జీవీపై కేసు నమోదు చేశారు.
మరోవైపు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ నాయుడుపై పోస్టులు పెడుతున్న వైసీపీ కార్యకర్తలు..సానుభూతిపరులపై కేసులు నమోదు చేస్తున్న సంగతి తెల్సిందే.