తెలంగాణ కాంగ్రెస్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు..!

 తెలంగాణ కాంగ్రెస్ లో ఎస్సీ వర్గీకరణ చిచ్చు..!

Categorization Lolli in Telangana Congress

Loading

తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ పార్టీ రోజుకో వివాదంతో సతమతవుతుంది. ఒక పక్క హామీలను అమలు చేయకుండా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను మూటకట్టుకుంటున్న సంగతి తెల్సిందే. మరోపక్క అధికార కాంగ్రెస్ పార్టీ నేతల తీరుతో ఉన్న వ్యతిరేకతను ఇంకా పెంచుకుంటున్నారు అని ఆరోపణలున్నాయి. ఎస్సీ వర్గీకరణకు అనుకూలం.. తెలంగాణలో అమలు చేసి తీరుతాము అని సాక్షాత్తు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నిండు అసెంబ్లీలో ప్రకటించిన సంగతి కూడా మనకు తెల్సిందే.

ఆ తర్వాత ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా ఆ పార్టీ సీనియర్ నేత.. ఎమ్మెల్యే జి వివేక్ ఇటీవల పరేడ్ గ్రౌండ్ లో ఓ భారీ బహిరంగ సభను నిర్వహించారు. ఆ సభలో బహిరంగంగానే ఇటు పార్టీని అటు ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ సంచలన ఆరోపణలతో పాటు విమర్శలు చేశారు.

ఈ విమర్శలపై పార్టీకి చెందిన సీనియర్ మాజీ ఎమ్మెల్యే.. ఏఐసీసీ కార్యదర్శి ఎస్ ఏ సంపత్ కుమార్ గాంధీభవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” ఎస్సీ వర్గీకరణను కాంగ్రెస్ మ్యానిఫెస్ట్ లో పెట్టినము. దానికి వ్యతిరేకంగా ఎవరూ మాట్లాడిన చర్యలు తప్పవంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” ఇదే అంశం గురించి ఏఐసీసీ సమావేశంలో చెప్పాను. పెద్దలకు చెప్పి తగిన చర్యలు తీసుకోవాలని సూచించినట్లు తెలిపారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *