రైతులకు కేంద్రం సంక్రాంతి కానుక..!

106 in 6 minutes. Melu.. Hats off police..!
సంక్రాంతి పండక్కి తెలంగాణ రైతాంగానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.ఇందులో భాగంగా పండుగ వేళ పసుపు రైతులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది.
రాష్ట్రంలోని నిజామాబాద్ లో జాతీయ పసుపు బోర్డు ప్రారంభోత్సవం చేయనున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. దీనికి పల్లె గంగారెడ్డిని చైర్మన్ గా నియమించింది.
గంగారెడ్డి ఈ పదవిలో మూడేండ్ల పాటు ఉండనున్నారు. అయితే గతంలో తాము అధికారంలోకి వస్తే నిజామాబాద్ కేంద్రంగా పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని బీజేపీ ప్రకటించింది. ప్రస్తుత బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ బాండ్ పేపర్ సైతం రాశారు కూడా.
