చైనా వైరస్ పై కేంద్రం కీలక ప్రకటన..!
చైనాను అతలాకుతలం చేస్తున్న కొత్త వైరస్ పై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. HMPV అనే వైరస్ కొత్త వైరస్ కాదు. దీన్ని మన దేశంలో 2001లోనే కనుగోన్నాము.
దేశ వ్యాప్తంగా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆరోగ్య శాఖ చాలా అప్రమత్తంగా ఉంది. సవాళ్లను ఎదుర్కోవడానికి కేంద్ర ఆరోగ్య శాఖ సిద్ధంగా ఉంది.
పరిస్థితిని బట్టి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా తెలిపారు. ప్రస్తుతానికైతే భయపడాల్సినవసరం లేదు. పరిస్థితులు అదుపులోనే ఉన్నాయి. తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు.