నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం
ఏపీలో కూటమి ప్రభుత్వం తీసుకోస్తున్న నూతన క్రీడా పాలసీకి సీఎం చంద్రబాబు ఆమోదం తెలిపారు. దేశంలో ఉత్తమ స్పోర్ట్స్ పాలసీగా ఏపీ నూతన పాలసీను తీర్చిదిద్దామన్నారు..
రాష్ట్రాన్ని క్రీడా కేంద్రంగా మార్చేందుకు 4 లక్ష్యాలతో పాలసీ రూపకల్పన చేశాము. ఉద్యోగాల్లో స్పోర్ట్స్ కోటా 2 నుంచి 3 శాతానికి పెంచుతూ నిర్ణయం తీస్కున్నాము. ఒలింపిక్స్, ఏషియన్ గేమ్స్ విజేతలకు ఇచ్చే ప్రోత్సాహకం భారీగా పెంచాము..
ఒలింపిక్స్లో బంగారు పతకం సాధిస్తే ఇచ్చే ప్రోత్సాహకం రూ.75 లక్షల నుంచి రూ.7 కోట్లకు పెంచుతూ కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందన్నారు.