మంత్రి సుభాష్ కు సీఎం చంద్రబాబు క్లాస్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి వాసంశెట్టి సుభాష్ కు క్లాస్ పీకారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదు కార్యక్రమంపై జరిగిన సమీక్ష సమావేశంలో ముఖ్యమంత్రి సుభాష్ ను క్లాస్ పీకారు.
ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఓటరు నమోదుపై మంత్రి వాసంశెట్టి సుభాష్ ను చంద్రబాబు అడిగారు. దీనికి సమాధానంగా ఇరవై తొమ్మిది శాతం నమోదైందని బదులిచ్చారు. దీంతో అగ్రహానికి గురైన చంద్రబాబు ఒక్కసారి ఎమ్మెల్యేగా గెలిచిన సీనియర్లను కాదని మీకు మంత్రి పదవిచ్చాను..
బాధ్యతతో పని చేయాలి. మంత్రి పదవిచ్చింది టైం పాస్ కోసం కాదు. ప్రజలకోసం రాజకీయాలు చేయండి. వ్యక్తిగత పనులకోసం రాజకీయాలు ఎందుకయ్యా అని సీరియస్ గా క్లాస్ పీకారని తెలుస్తుంది.