రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి..అధికార కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి రేపు సోమవారం ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు.. రేపు సోమవారం లోక్ సభ లో తెలంగాణ నుండి గెలుపొందిన కాంగ్రెస్ ఎంపీలు ప్రమాణస్వీకారం చేయనుండటంతో వారితో సమావేశం కానున్నారు.
అనంతరం నామినేటెడ్ పోస్టులు, పీసీసీ అధ్యక్షుడి ఎంపిక, మంత్రి వర్గ విస్తరణ తదితర అంశాలపై కాంగ్రెస్ అధిష్ఠానంతో చర్చిస్తారని సమాచారం.
అలాగే ఎంపీ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోవడానికి గల కారణాలపైనా పార్టీ పెద్దలు ఆరా తీస్తారని తెలుస్తోంది..అయితే ప్రస్తుతం ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఢిల్లీలో ఉన్న సంగతి తెల్సిందే..