సీఎం రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా

 సీఎం రేవంత్ రెడ్డిది పేమెంట్ కోటా

కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు జరిగిన అన్యాయంపై జరుగుతున్న చర్చలో సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ మాజీ మంత్రి కేటీఆర్ లా సాగుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కేటీఆర్ హారీష్ రావు ఢిల్లీకెళ్లి మోదీతో చీకటి ఒప్పందం చేసుకున్నారు.. తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే సీనియర్ నాయకులైన.. ముఖ్యమంత్రి.. కేంద్ర మంత్రిగా పని చేసిన కేసీఆర్ సభలో లేరు.. కేటీఆర్ లా మేము మేనేజ్మెంట్ కోటాలో ఇక్కడకి రాలేదు. అయ్యా పేరు తాతా పేరు చెప్పుకుని ఈ స్థాయికి రాలేదు.. మోదీ చూస్తే ఏమవుతుందో అనే భయంతో కేసీఆర్ అండ్ బ్యాచ్ బీజేపీపై మాట్లాడటం లేదు అని అన్నారు.

దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ పదేండ్లు బీజేపీపై మేము కొట్లాడినం.. తెలంగాణ ఏర్పడిన కొత్తలో ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపితే తెలంగాణకు ఇవ్వమని డిమాండ్ చేస్తూ ఢిల్లీ వెళ్లి ధర్నాకు దిగాము.. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ.. ఐటీఐఆర్ లాంటి సంస్థలను రద్ధు చేస్తే పోరాడినము.. నల్లచట్టాలపై పొరాడటం మొదలు పెట్టిందే మేము..

తెలంగాణ రైతులు నూకలు తినడం నేర్చుకోవాలని అప్పటి కేంద్ర మంత్రి అవమానపరిచేలా మాట్లాడితే కొట్లాడినం. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా ఇవ్వలేదు.. మిషన్ భగీరథ.. మిషన్ కాకతీయకు పైసా ఇవ్వలేదు.. విభజన చట్టంలో ఉన్న ఏ ఒక్క హమీని సైతం నెరవేర్చలేదు. అందుకే ఆ కక్షతో తెలంగాణకు పదేండ్లు అన్యాయం చేశారు. ఇప్పుడు చేశారు.. నేను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిలెక్క పేమెంట్ కోటాలో ఇక్కడదాక రాలేదు.. ఆ కోటాలో ముఖ్యమంత్రి అయ్యారు అని వాళ్ల పార్టీ నేతలే అన్నారు అని అన్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *