రేవంత్ ఫోటోకి కలెక్టర్ పాలాభిషేకం
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి చిత్ర పటానికి ఓ జిల్లా కలెక్టర్ పాలాభిషేకం చేసిన సంఘటన వివాదాస్పదం అవుతుంది.. వివరాల్లోకి వెళ్తే సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి వ్యవహరించిన తీరు విమర్శల పాలైంది.
నిన్న గురువారం రుణమాఫీ సందర్భంగా సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి రైతువేదిక వద్ద కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సంబురాలు నిర్వహించారు…
సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, కాంగ్రెస్ అగ్రనేతలైన సోనియాగాంధీ, రాహుల్ గాంధీ ఫ్లెక్సీలకు క్షీరాభిషేకం చేశారు.కలెక్టర్ హోదాలో ఉండి రాజకీయ నేతల ఫ్లెక్సీకి క్షీరాభిషేకం చేయడం వివాదాస్పదమైంది