ఏపీ శాసనమండలిలో గందరగోళం
ఏపీ శాసనమండలిలో గందరగోళం నెలకొన్నది. ఈరోజు ఉదయం ప్రారంభమైన శాసనమండలి సమావేశాల్లో మెడికల్ కాలేజీల అంశంపై వైసీపీ,కూటమి పార్టీల మధ్య రగడ మొదలైంది. మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేయడానికి కూటమి ప్రభుత్వం సిద్ధమా..? అని వైసీపీ సభ్యులు ప్రశ్నించారు.
దీనికి సమాధానంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వంద ఎలుకలు తిన్న పిల్లి హాజ్ యాత్రకు వెళ్లినట్లు ఆ పార్టీ నేతలు మాట్లాడుతున్నారు అని వ్యాఖ్యానించారు.
దీంతో హాజ్ యాత్రను ప్రస్తావించడంపై వైసీపీ అభ్యంతరాన్ని వ్యక్తం చేసింది. దీంతో సహచర మంత్రులందరూ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాటల్లో తప్పు ఏముంది అని మద్ధతుగా నిలవడం విశేషం.