మహారాష్ట్రలో కాంగ్రెస్ మహా పతనం…?
నిన్న శనివారం విడుదలైన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి 233స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. మరోవైపు విపక్ష కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 51 స్థానాల్లోనే విజయభేరి మ్రోగించింది.
ఇతరులు నాలుగు స్థానాల్లో గెలుపొందారు. ఈ నేపథ్యంలో తాజా ఫలితాలతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పతనం తారాస్థాయికి చేరిందని రాజకీయ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. మహారాష్ట్రలో 1990లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 141 స్థానాల్లో గెలుపొందింది. ఆ తర్వాత 1995లో 80స్థానాలకు పడిపోయింది. ఆ తర్వాత 1999లో 75స్థానాలకు దిగజారింది.
ఆ తర్వాత 2004లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 69 స్థానాలను తెచ్చుకుంది.2009లో 82 స్థానాలు,2014లో 42 స్థానాలు,2019లో 44స్థానాలతో సరిపెట్టుకుంది. తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం 20 స్థానాల్లోనే గెలుపొందింది. దీంతో మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీకి ప్రజల్లో ఆదరణ తగ్గిందని.. మహాపతనం తారా స్థాయికి చేరింది అని రాజకీయ నిపుణులు సూచిస్తున్నారు.