బీఆర్ఎస్ కు కాంగ్రెస్ కౌంటర్
తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి అవమానించడంతో మాజీ మంత్రి… ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కంటతడి పెట్టుకున్నారని బీఆర్ఎస్ తన అధికారక ట్విట్టర్ అకౌంట్ లో చేసిన ట్వీట్ కు అధికార టీకాంగ్రెస్ కౌంటరిచ్చింది.
‘ఏడుపు ఎందుకు సబితమ్మా? చేవెళ్ల చెల్లెమ్మా అని కాంగ్రెస్ పార్టీ ఆదరించినందుకా? ఉమ్మడి ఏపీ లో హోం మంత్రిని చేసినందుకా? కష్టకాలంలో కాంగ్రెస్ను మోసం చేసి పదవి కోసం బీఆర్ఎస్ లో చేరినందుకా?అని ప్రశ్నించింది..
నువ్వు ఏడిస్తే సానుభూతి రాదు సబితమ్మా’ అని కాంగ్రెస్ ట్వీట్ చేసింది