రైతుభరోసా పై కాంగ్రెస్ సర్కారు బిగ్ ప్లాన్..!

 రైతుభరోసా పై కాంగ్రెస్ సర్కారు బిగ్ ప్లాన్..!

Telangana : తెలంగాణ ఏర్పాటు అనంతరం రైతులు పండించే పంటకు ప్రభుత్వమే పెట్టుబడి సాయం అందించేలా రైతుబంధు కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది నాటి కేసీఆర్ ప్రభుత్వం..ఎకరాకు ఏడాదికి 10 వేల రూపాయల సహాయాన్ని అందిస్తూ వచ్చింది.11 దపాలుగా ఈ సాయాన్ని రైతుల ఖాతాల్లో జమచేసింది.. వర్షాకాలం,యాసంగి సీజన్ లు ఇలా రెండు దపాలుగా ఈ సాయం రైతులకు అందేది.దీన్ని ఆదర్శంగా తీసుకుని పలు రాష్ట్రాల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేసారు.కేంద్రప్రభుత్వం సైతం రైతుకు పెట్టుబడి సాయం అందించడంతో తెలంగాణ రైతుబంధుకు ఒక సంచలనంగా నిలిచింది.

2023 లో కాంగ్రేస్ అధికారంలోకి వచ్చింది.తమ మేనిఫేస్టోలో పంట పెట్టుబడి సాయం రైతుభరోసా పేరుతో ఏడాదికి 15 వేలు ఇస్తామని ప్రకటించింది.ప్రభుత్వం వచ్చాక మొదటి దఫా కేసీఆర్ ఇచ్చిన 5000/- రూపాయలను సగం సగం రైతుల ఖాతాల్లో వేసింది..వర్షాకాలం పంటకు పెట్టుబడి సాయన్ని ఎగ్గొట్టింది కాంగ్రేస్ ప్రభుత్వం.కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ నేడు యాసంగి సీజన్ కు రైతుబంధును ఎగ్గొట్టే ప్లాన్ రచించిందని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.

తాజాగా నిత్యం రైతుబంధు కోసం రెండు దపాలుగా రైతులు దరఖాస్తు చేసుకోవాలంటూ ఒక ప్రతిపాదనను తీసుకువచ్చింది.అయితే ఈ ప్రతిపాదన వల్ల రైతులు పూర్తిగా రైతుబంధు ఎగ్గొట్టే ప్రయత్నం కాంగ్రేస్ ప్రభుత్వం చేస్తుందని చర్చించుకుంటున్నారు..రైతు అలా అప్లై చేసుకుంటే దరఖాస్తుల పరిశీలన పేరుతో కాలయాపన చేసి రైతులకు రైతు బంధు రాకుండా చేయడంలో బాగమే ఈ ప్రతిపాదన అని ప్రతిపక్ష బీఆర్ఎస్ ఆరోపిస్తుంది.రైతుబంధు పూర్తిగా ఎగనామం పెట్టేందుకే కాంగ్రేస్ ప్రయత్నాలు చేస్తుందని రైతులు రచ్చబండ దగ్గర చర్చించుకుంటున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *