ఆస్తి కోసం స్నేహితుడి భార్యని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేత

 ఆస్తి కోసం  స్నేహితుడి భార్యని కిడ్నాప్ చేసిన కాంగ్రెస్ నేత

Congress leader who kidnapped friend’s wife for property

Loading

తెలంగాణ రాష్ట్రంలోని షాద్ నగర్ నియోజకవర్గం కొత్తూర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు మహేందర్, తిమ్మాపూర్‌కు చెందిన ఎడ్ల శ్రీకాంత్ ఇద్దరు స్నేహితులు.ఇద్దరు కలిసి గతంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు.. అయితే గత సంవత్సరం శ్రీకాంత్ అనారోగ్యంతో మృతి చెందాడు.

శ్రీకాంత్ భార్య రాధికకు తన తల్లిదండ్రులు ఒక ఎకరం భూమి ఇచ్చారు.. ఈ భూమి మీద కాంగ్రెస్ నేత మహేందర్ కన్నుపడింది.రాధికకు తరచూ ఫోన్ చేసి శ్రీకాంత్ రియల్ ఎస్టేట్లో పెట్టిన పెట్టుబడుల వివరాలు చెబుతానని మహేందర్ నమ్మ బలికాడు.. వివరాల కోసం వచ్చిన రాధికను ఈ నెల 20న తన కారులో బలవంతంగా కిడ్నాప్ చేశాడు.

తిరుపతికి తీసుకెళ్తూ మధ్యలో మహేందర్‌తో పాటు అతడి డ్రైవర్ శేఖర్ కత్తితో బెదిరించి రాధిక చేతికి ఉన్న ఉంగరంతో పాటు, కొంత నగదు తీసుకొని ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయాలని బలవంతం చేశారు.రాధిక ఈనెల 20 నుంచి కనిపించడం లేదని శ్రీకాంత్ తల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. ఈనెల 22న రాధిక తప్పించుకొని కొత్తూరు పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

మహేందర్ తనను కిడ్నాప్ చేసి, బలవంతంగా ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించుకున్నాడని చెప్పింది.. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మహేందర్, డ్రైవర్ శేఖర్‌ను అరెస్ట్ చేశారు. వీరు నేరం ఒప్పుకోవడంతో రిమాండ్‌కు తరలించారు

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *