ఎమ్మెల్సీ కవితకు కాంగ్రెస్ మంత్రి అభినందనలు..!
Politics : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ.. సీనియర్ నేత కల్వకుంట్ల కవితకు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అభినందనలు తెలిపారు. ఈరోజు శుక్రవారం ఇందిరా పార్కు వద్ద జరిగిన బీసీ మహాసభలో పాల్గోన్న ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ బీసీ డిక్లరేషన్.. నలబై రెండు శాతం రిజర్వేషన్లను అమలు చేయాలని డిమాండ్ చేసిన సంగతి తెల్సిందే.
ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటరిస్తూ ” పదేండ్లు అధికారంలో ఉన్న సమయంలో బీసీల ఊసే ఎత్తలేదు. అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు బీసీలకు రిజర్వేషన్లు పెంచలేదు.. అధికారం పోయాక బీసీలు గుర్తుకు వచ్చినందుకు కవితకు అభినందనలు..
బీసీ నేత ఈటల రాజేందర్ ను మెడబెట్టి బయటకు పంపించారు. బీఆర్ఎస్ కు దమ్ముంటే బీసీలపై నిజంగా ప్రేమ ఉంటే పార్టీ అధ్యక్ష పదవి కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ బీసీలకు ఇవ్వాలి. బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయాలనే డెడికెటేడ్ కమిషన్ ఏర్పాటు చేశాము అని ఆయన అన్నారు.