దానం కు షాకిచ్చిన కాంగ్రెస్ ..

Congress Shock to Danam Nagender
బీఆర్ఎస్ ను వీడి కాంగ్రేస్ లో చేరిన ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే దానం నాగేందర్ కు కాంగ్రెస్ షాకిచ్చింది.దానం నాగేందర్ నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు తెలియకుండా కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు..దీంతో ఆగ్రహానికి గురైన దానం నాగేందర్ కూల్చివేతలను అడ్డుకున్నారు..
తన అనుమతి లేకుండా ఎలా కూల్చివేస్తారంటూ. ఎక్కడినుంచో బ్రతకడానికి వచ్చినోళ్లు మాపై దౌర్జన్యం చేస్తారా అంటూ అధికారులపై దానం నాగేందర్ ఫైరయ్యారు..చింతల్ బస్తీలోని షాదన్ కాలేజీ ఎదురుగా ఉన్న కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.
దావోస్ నుంచి సీఎం వచ్చే వరకు కూల్చివేతలు ఆపాలని దానం అన్నారు. కూల్చివేతలు ఆపకుంటే ఆందోళన చేస్తానంటూ హెచ్చరించారు.కాంగ్రెస్ లో దానం నాగేందర్ కు ప్రాధాన్యం దక్కట్లేదనే చర్చలకు ఈ ఘటన మరింత బలాన్ని చేకూరుస్తుంది.
