రైతులపై టీడీపీ ఎమ్మెల్యే వివాదస్పద వ్యాఖ్యలు
ఏపీ అధికార టీడీపీకి చెందిన తిరువూరు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్ మరోసారి వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే పలు వివాదాల్లో చిక్కుకున్న ఆయన ఈసారి రైతులను ఉద్ధేశిస్తూ ఆ వ్యాఖ్యాలు చేశారు.
తనపై వస్తున్న లైంగిక ఆరోపణలపై విచారణ జరపాలంటూ ఇటీవల ఎమ్మెల్యే శ్రీనివాస్ దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ” ఎన్నికల ఫలితాలకు ముందే రూ లక్షలు ఖర్చు పెట్టి పంట కాలువల్లో పూడికలు తీయించాను.
అదంతా రైతుల కోసమే కదా చేసింది నేను. కానీ ఈరోజు నాకు అండగా ఏ రైతు అయినా వచ్చారా ..?. కుక్కలకు ఉన్న విశ్వాసం రైతులకు లేదు. ఒక్కపూట అన్నం పెడితేనే విశ్వాసం చూపించే కుక్కలకున్న తెలివి వాళ్లకు లేకపాయే అంటూ వివాదస్పద వ్యాఖ్యలు చేశారు.