ఒకపక్క వివాదాలు.!.. మరోపక్క రికార్డులు..!
సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా.. రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించగా ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన మూవీ పుష్ప -2. ఈ చిత్రం ప్రీమియర్ షో నుండే వివాదాలతో పాటు రికార్డులను సొంతం చేసుకుంటుంది.
తాజాగా ఈ మూవీ హిందీలో ఇప్పటివరకు రూ.740.25కోట్ల కలెక్షన్లను రాబట్టింది. దీంతో సినిమా రిలీజైన మూడో వారంలోనూ వంద కోట్లకు పైగా వసూళ్లను సాధించిన చిత్రంగా ఆల్ టైం రికార్డు సృష్టించింది.
మొత్తం ఇరవై రెండు రోజుల్లో ఈ సినిమాకు బాలీవుడ్ లో రూ.740.25కోట్ల వసూళ్ళు వచ్చాయి.. మొత్తంగా పుష్ప 2 రూ.1719.5కోట్లను కొల్లగొట్టింది.