మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం..!
దివంగత మాజీ ప్రధానమంత్రి మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలు రేపు శనివారం ఉదయం పదకొండు. పదకొండున్నర గంటల మధ్యలో నిర్వహించనున్నట్లు కేంద్ర హోం శాఖ ఇప్పటికే ప్రకటించిన సంగతి మనకు తెల్సిందే.
అయితే మన్మోహాన్ సింగ్ అంత్యక్రియలపై వివాదం నెలకొన్నట్లు తెలుస్తుంది. ఆయన స్మారకార్థం దేశ రాజధాని మహానగరం ఢిల్లీలో స్థలాన్ని కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ తరపున కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది.
దీనికి కేంద్రం అనుమతివ్వలేదని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. తమను సంప్రదించకుండానే నిగమ్ బోధ్ ఘాట్ లో అంత్యక్రియలు నిర్వహిస్తామని కేంద్ర హోం శాఖ ప్రకటించింది.