రేవంత్ మరో బిష్ణోయ్
సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ సీనియర్ నేత డాక్టర్ దాసోజు శ్రవణ్ చేసిన వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి. సీఎం రేవంత్ పనితీరును గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్, దావూద్ ఇబ్రహీంతో పోల్చిన బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజ్ శ్రవణ్.. రేవంత్‌రెడ్డిని ప్రకృతే చూసుకుంటుందని వ్యాఖ్యానించారు. దాసోజు శ్రవణ్ ఇంకా ఏమన్నారంటే… ముఖ్యమంత్రి స్థానం లో ఉన్న వాడు తెలంగాణ ప్రజలకు ఆద్యుడిగా ఉండాలి. రేవంత్ తీరు కుక్క తోక వంకర అనే సామెతను గుర్తుకు తీస్తోంది. అహ్మదాబాద్ జైల్లో ఉన్న గ్యాంగ్‌స్టర్ బిష్ణోయ్ లాగా రేవంత్ మాట్లాడుతున్నాడు. వీధి రౌడీ కన్నా అద్వాన్నంగా ఉంది రేవంత్ భాష. ఆయన భాష ఫై తెలంగాణ సమాజం లోతుగా ఆలోచించాలి.
దావూద్ ఇబ్రహీం తరహాలో రేవంత్ మాట్లాడుతున్నాడు. క్రిమినల్ సీఎం లా ఉంది రేవంత్ పద్ధతి. రాష్ట్రాన్ని నడుపుతున్న వ్యక్తి క్రిమినల్ అయితే ఇక సమాజం ఎట్లా ? కేసీఆర్ ను ఒక సంవత్సరం లో ఫినిష్ చేస్తా అంటారా ? కే టీ ఆర్ ను హరీష్ రావు తో ఫినిష్ చేయిస్తా అంటావా ? సీఎం వాడాల్సిన భాషేనా ? కాంగ్రెస్ నాయకులు ఆలోచించాలి. ఈ సీఎం కు గడ్డి పెట్టాలి
కాంగ్రెస్ కు రేవంత్ భస్మాసురిడిలా మారాడు. కాంగ్రెస్ ను ఫినిష్ చేసేదే రేవంత్.ఈ శాడిస్టు సీఎం నుంచి కాంగ్రెస్ ను రక్షించండి. సీఎం సీటు లో కూర్చున్నాక కూడా రేవంత్ మారడా ? కేసీఆర్ లివింగ్ లెజెండ్. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అంటావా ? రేవంత్ అసలు నువ్వు మనిషేనా? రేవంత్ సీఎం యా ?పాలెగాడా ?
రేవంత్ సమైక్య వాదుల చెప్పుల మోస్తున్నపుడు కేసీఆర్ తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోస్తున్నాడు. కేసీఆర్ పేరు మార్చడానికి గోడ మీద పెయింట్ కాదు ..పెయింటర్ రెడ్డి! తెలంగాణ ఆత్మ కేసీఆర్ . సమైక్యవాదులు కూడా కేసీఆర్ పై రేవంత్ లాంటి భాష వాడలేదు. రేవంత్ కూర్చుంటున్న సచివాలయం కేసీఆర్ కట్టిందే. కేసీఆర్ శ్రమ లేకుంటే తెలంగాణ ఇంతటి ఉన్నత స్థితి లో ఉండేదా ? నెత్తురు చుక్క లేకుండా తెలంగాణ సాధించిన కేసీఆర్ లాంటి మహానుభావుడి పై నీచమైన భాష నా రేవంత్ రెడ్డి ? నీకు న్యాయమా ? గాంధీ ,నెహ్రూ లను తిడితే ఎంత నేరమో, కేసీఆర్ ను తిడితే అంత నేరం రేవంత్ రెడ్డి. అన్నం పెట్టిన చంద్రబాబు కు సున్నం పెట్టిన చరిత్ర రేవంత్ రెడ్డి ది. పీసీసీ పదవిని దొడ్డి దారిన తెచ్చుకుంది రేవంత్ రెడ్డి ది. పీసీసీ అధ్యక్షుడిగా తన సొంత పార్టీ నేతలను ఫినిష్ చేసిన చరిత్ర రేవంత్ ది.
రేవంత్ వ్యవహరిస్తున్న తీరు కాంగ్రెస్ కల్చర్ కాదు. నెహ్రు ను మోడీ అవమానిస్తున్నట్టే, రేవంత్ కేసీఆర్ ను అవమానిస్తున్నారు. రేవంత్ శిశుపాలుడి లా మారాడు. ప్రకృతి ప్రకోపానికి రేవంత్ గురి కావాల్సిందే. నెగటివ్ మైండ్ సెట్ తో రేవంత్ ఎందరో కాంగ్రెస్ టీడీపీ నేతల రాజకీయ జీవితాలను నాశనం చేశాడు. కేసీఆర్ ను ఫినిష్ చేయడం రేవంత్ తరం కాదు . తస్మాత్ జాగ్రత్త రేవంత్. తెలంగాణ సమాజం కర్రు గాల్చి వాత పెడుతుంది. రేవంత్ ది ప్రజా పాలన కాదు మూర్ఖపు పాలన హిట్లర్ పాలన. రేవంత్ ది దుర్మార్గపు పాలన నా కాదా? తెలంగాణ సమాజం ఆలోచించాలి.హైడ్రా ,మూసి ,జీవో 46 ,జీవో 29 ,తెలంగాణ స్పెషల్ పోలీస్ ఇలా అన్నిటిలో రేవంత్ ది నెగటివ్ మైండ్ సెట్. చిల్లర మల్లర చేష్టలు మానుకో రేవంత్. పాలన చేత కాక పిచ్చి మాటలు. అడ్డు అదుపు లేకుండా అహంకారం తో వ్యవహరిస్తే రేవంత్ ను ప్రకృతే చూసుకుంటుంది అని అన్నారు.