ఫిబ్రవరి 5న ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు..!
ఢిల్లీ సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. రాష్ట్రంలో ఉన్న మొత్తం డెబ్బై స్థానాలకు ఒకే విడతలో ఎన్నికలు జరగనున్నాయి.
ఫిబ్రవరి పదిహేను తారీఖుతో ప్రస్తుత అసెంబ్లీ పదవి కాలం ముగియనున్నది. జనవరి పదో తారీఖున ఎన్నికల నోటిఫికేషన్ ను విడుదల చేయనున్నది.
ఈ నెల పదిహేడో తారీఖు వరకు నామినేషన్లను స్వీకరించనున్నది.ఈ నెల పద్దెనిమిది తారీఖున నామినేషన్లను పరిశీలించనున్నది.
ఇరవై తారీఖు వరకు నామినేషన్లను ఉపసంహరణకు గడవు ఇచ్చింది. ఫిబ్రవరి ఐదో తారీఖున ఎన్నికలు జరగనుండగా ఎనిమిదో తారీఖున ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.