విశాఖకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..!
జనసేన అధినేత.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్ రేపు బుధవారం మధ్యాహ్నం విశాఖ పర్యటనకు బయలుదేరనున్నారు. ఈ క్రమంలో బుధవారం మ.12 గంటలకు విశాఖకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేరుకోనున్నారు.
అనంతరం ఆరోజు సా.4:15 గంటలకు INS డేగాలో ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తో కలిసి విశాఖ పర్యటనకు రానున్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీకి స్వాగతం పలకనున్నారు.
అనంతరం సా.4:45 నుంచి ప్రధాని మోదీతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబుతో పవన్ రోడ్‌షో కార్యక్రమంలో పాల్గోనున్నారు. అనంతరం సా.5:30 గంటలకు జరగనున్న ప్రధాని మోదీ బహిరంగసభలోని పాల్గోంటారు. ఆ తర్వాత రేపు రాత్రి 7:25 గంటలకు గన్నవరం నుండి పవన్ తిరిగి ప్రయాణం కానున్నారు.