డిప్యూటీ సీఎం తాలుకా మరి..!-వేల కోట్ల రూపాయల భూమి స్వాహా..!

 డిప్యూటీ సీఎం తాలుకా మరి..!-వేల కోట్ల రూపాయల భూమి స్వాహా..!

Loading

ఆయన డిప్యూటీ సీఎం తాలుఖా..?. అంతేనా.. అదే డిప్యూటీ తో కల్సి అనేక సినిమాలను నిర్మించిన భాగస్వామి.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో పీపుల్స్ ఫ్యాక్టరీ అనే సంస్థ ద్వారా పలు సినిమాలను నిర్మించిన ప్రముఖ నిర్మాత. అయితేనేమి వడ్డించేవాడు మనవాడైతే చివరన కూర్చున్న కానీ మనకు అందుతుంది అని పెద్దలు ఊరికినే అనలేదు మరి. ఆ క్రమంలోనే ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూములను బహుమతిగా సదరు నిర్మాతకి కట్టబెట్టింది కూటమి ప్రభుత్వం. అసలు విషయానికి వస్తే ” పవన్ పార్టనర్ కు 1200ఎకరాలు అంటూ ప్రముఖ తెలుగు దినపత్రిక అయిన సాక్షి ఓ వార్తను ప్రచురించింది.

ఆ విషయానికి వస్తే “పీపుల్ టెక్ టెక్నాలజీ, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, పీపుల్ స్క్రీన్స్, పీఎంఎఫ్ టూర్స్ అండ్ ట్రావెల్స్, పీటీజీ వెంచర్స్, వీ జోన్ హాస్పిటల్స్ వంటి విభిన్న రంగాల్లో వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తున్న టీజీ విశ్రప్రసాద్ ఇప్పుడు ఎటువంటి అనుభవం లేకుండానే ఈ-మొబిలిటీ పార్కుతోపాటు ఈ- స్కూటర్ల తయారీ యూనిట్ను ఏర్పాటు చేస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు.ఈ-మొబిలిటీ వాహన తయారీ కోసం ఇంకా భాగస్వామ్య కంపెనీని కూడా ఎంచుకోలేదు. తైవాన్, కొరియా, చైనా దేశాలకు చెందిన కంపెనీలతో భాగస్వామ్య ఒప్పందం కోసం చర్చలు జరుపుతున్నట్లు ప్రభుత్వం విడుదల చేసిన పత్రికా ప్రకటనలోనే స్పష్టంగా పేర్కొన్నారు.

రూ.2,100 కోట్ల పెట్టుబడులు పెట్టే ఆర్థికస్థితి పీపుల్ గ్రూపుకు లేనే లేదు. అయినా ఈ విషయాలు ఏమీ పరిగణనలోకి తీసుకోకుండా ఏపీ ఈడీబీ పీపుల్స్ గ్రూపుతో ఒప్పందం చేసుకుంది.కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 1,200 ఎకరాలను రూ.1,800 కోట్లతో ఈ-మొబిలిటీ పార్కుగా అభివృద్ధి చేయడంతో పాటు, యాంకర్ (ప్రధాన) కంపెనీగా పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ రూ.300 కోట్లతో ఈ -మొబిలిటీ యూనిట్ను ఏర్పాటు చేసే విధంగా ఒప్పందం కుదుర్చుకుంది.ప్రస్తుతం ఎకరం రూ.కోటి వరకు ఉన్న ఈ భూమి ధర.. ఓర్వకల్లు పారిశ్రామిక పార్కు అభివృద్ధి చెందితే రూ.ఐదారు కోట్ల వరకు వెళుతుంది. ఈ లెక్కన 1,200 ఎకరాల భూమి విలువ రూ.ఐదారు వేల కోట్లకు పైగానే ఉంటుందని పరిశ్రమల శాఖ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈ అంశం తెలుగుదేశం పార్టీతో పాటు పరిశ్రమల శాఖలో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది.

మరోవైపు భూములు కేటాయించేవాడు బిజినెస్‌ పార్ట్‌నర్‌ అయితే ఎన్ని వందల ఎకరాలైనా సొంతమైపోతాయనేందుకు ఈ ‘ఒప్పందం’ అతికినట్లు సరిపోతుంది.సినిమా నిర్మాణానికి, వాహనాల తయారీకి ఎక్కడా పొంతన కుదరకున్నా, ఏ మాత్రం అనుభవం లేకున్నా.. ఆ పార్ట్‌నర్‌ అడగడం.. ఈ పార్ట్‌నర్‌ మద్దతు పలకడం.. పొలిటికల్‌ పార్ట్‌నర్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం చకచకా జరిగిపోయింది..కనీసం ఈ–మొబిలిటీ వాహనాలు తయారు చేసే కంపెనీతో భాగస్వామ్యం కూడా లేకుండానే ఏకంగా 1,200 ఎకరాలు కేటా­యిస్తూ….కూటమి సర్కారు ఒప్పందం చేసుకోవడం పట్ల అటు వ్యాపార వేత్తలు..రాజకీయ విశ్లేషకులు.. ఇటు అధికారులు నివ్వెరపోతున్నారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *