నిర్మాతపై దేవిశ్రీ ప్రసాద్ అసంతృప్తి
తమిళనాడు లో చెన్నైలో జరిగిన పుష్ప -2 ఈవెంట్లో నిర్మాత రవిశంకర్ పై మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ అసంతృప్తి వ్యక్తం చేయడం వైరల్ గా మారింది.
‘టైం కు పాట, BGM ఇవ్వలేదని నిర్మాతలు అంటున్నారు. నామీద మీకు ప్రేమ కంటే ఎక్కువ కంప్లైంట్స్ ఉన్నాయి.
ఇప్పుడు కూడా ఆలస్యంగా వచ్చానని అంటున్నారు. నాకు సిగ్గు ఎక్కువ. నేనేం చేయను. ఇవన్నీ సెపరేట్ గా అడిగితే కిక్ ఉండదు. అందుకే ఇలా అడిగేస్తున్నా’ అని మాట్లాడారు.ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న పుష్ప – 2 మూవీ వచ్చే నెల డిసెంబర్ ఐదో తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.