నాపై తప్పుడు ప్రచారం -దేవినేని అవినాష్

devineni avinash warns chandrababu
3 total views , 1 views today
ఏపీ ప్రధాన ప్రతిపక్ష వైసీపీకి చెందిన యువనేత దేవినేని అవినాష్ తనపై జరుగుతున్న అసత్య ప్రచారంపై స్పందిస్తూ ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో మాట్లాడుతూ ” నేను విదేశాలకు పారిపోతున్నట్లు.. ఆ క్రమంలో హైదరాబాద్ లోని శంషాబాద్ విమానశ్రయంలో పోలీసులు నన్ను అరెస్టు చేసినట్లు కొన్ని మీడియా సంస్థలు,టీడీపీ అనుకూల మీడియా,సోషల్ మీడియాలో నాపై అసత్య ప్రచారం చేస్తున్నారు.
అదంతా అసత్య ప్రచారం అని కొట్టిపారేశారు. నేను ఏ తప్పు చేయలేదు.. నేను రెండు నెలలుగా విజయవాడలోనే ఉంటున్నాను.. రోజు ప్రజలు వచ్చి నన్ను కలుస్తున్నారు..
వారి సమస్యలను నాకు చెప్పుకుంటున్నారు.. పనికిమాలిన పనిలేని టీడీపీ సోషల్ మీడియా,వారి అనుకూల మీడియాలో నాపై ఇలాంటి అసత్య ప్రచారం చేస్తున్నారు “అని ఆయన ఆ వీడియోలో పేర్కొన్నారు.
