కొండని తవ్వి ఎలుకను పట్టిర్రు..

Dig the hill and catch the rat..
బీఆర్ఎస్ ఫైర్ బ్రాండ్ హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కాంగ్రేస్ ప్రభుత్వం,ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మరో మారు ఫైర్ అయ్యారు.. హుజూరాబాద్ నియోజకవర్గంలో కేసీఆర్ పాలనలో 1,18,216 ఎకరాలకు రైతు బంధు ఇస్తే.. రేవంత్ రెడ్డి 1,17,630 ఎకరాలకు ఇస్తున్నారు అంటే వీళ్లు అంత కష్టపడి తీసింది 586 ఎకరాలు మాత్రమే అన్నారు..
రాష్ట్రవ్యాప్తంగా చూస్తే కేసీఆర్ పాలనలో కోటి 52 లక్షల ఎకరాలకు రైతు బంధు ఇస్తే రేవంత్ రెడ్డి కోటి 50 లక్షల ఎకరకాలకు ఇస్తున్నాడన్నారు.కొండని తవ్వి ఎలుకను పట్టినట్టు కేవలం 1.38 శాతం మాత్రమే తగ్గించారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వం రూ.22 వేల కోట్లు వృధా చేసిందని అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడాడని,నువ్వు తీసేసిన వాటికి కనీసం రూ. 200 కోట్లు కూడా కావు.. మరి ఇవాళ ఏం జవాబు చెప్తావంటూ విమర్శించారు.
