శ్రీనగర్ కాలనీ లోని తన కార్యాలయానికి దిల్ రాజును తీసుకెళ్లిన ఐటీ అధికారులు..!

గత నాలుగు రోజులుగా ప్రముఖ నిర్మాత దిల్ రాజు, అతని సోదరుడు శిరిష్, తనయ హన్సిత రెడ్డి ఇండ్లపై ఐటీ దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే.
ఈరోజు ఉదయం ఐటీ దాడులు ముగిసాయి. దీనికి సంబంధించిన లీగల్ ఫార్మాలిటీస్ ను అధికారులు పూర్తి చేస్తున్నారు.
ఈ క్రమంలో నిర్మాత దిల్ రాజును అధికారులు శ్రీనగర్ కాలనీలోని దిల్ రాజు ప్రోడక్షన్స్ కార్యాలయానికి తరలించారు. ఐటీ సోదాల్లో దిల్ రాజు ,ఆయన కుటుంబ సభ్యుల ఇండ్లల్లో పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నరు.
