ఆంధ్రావాళ్లు తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా..?
![ఆంధ్రావాళ్లు తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా..?](https://www.singidi.com/wp-content/uploads/2024/11/Breaking-News-3-850x560.jpg)
another by election in telangana
తెలంగాణ రాష్ట్ర అధికార పార్టీ కాంగ్రెస్ కు చెందిన నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి ప్రముఖ టాలీవుడ్ హీరో … ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పై చేసిన వ్యాఖ్యలపై పెనుదుమారం రేగింది. ఎమ్మెల్యే భూపతిరెడ్డి మాట్లాడుతూ పుష్ప -2 ఓ చెత్త సినిమా.. మా సీఎం రేవంత్ రెడ్డిపై అవాక్కులు.. చవాక్కులు పేలితే ఖబడ్దార్.. నువ్వు ఆంధ్రోడివి.. అట్లనే ఉండు.. బతకడానికి వచ్చావు..
ఇచ్చిన గౌరవం తీసుకోని వ్యాపారం చేసుకో. అంతే కానీ తెలంగాణకు మీరేం చేశారు..?. పద్ధతి మార్చుకోకుంటే మీ సినిమాలు ఆడనివ్వము. మౌనంగా మీ వ్యాపారం చేస్కో.. లేకపోతే ఏపీకి వెళ్ళిపో అని వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యే భూపతి రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ బీజేపీ ఉపాధ్యాక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీ వాళ్లు తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా రేవంత్ రెడ్డి గారు అని ప్రశ్నించారు.
తెలంగాణ ఏర్పడి పదకొండు ఏండ్లైన తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఏంటి..? ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి..?. మీరు మీ ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోవాలి.. లేదంటే మీ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదు అని ట్విట్టర్ లో పోస్టు చేశారు.
![](https://www.singidi.com/wp-content/uploads/2024/12/E-Paper-Coming-Soon.png)