భోజనం చేశాక ఖచ్చితంగా ఇది చేయాల్సిందేనా..?

Do you have to do this after eating?
సహాజంగా అందరం తిన్నాక నిద్రపోవాలనే చూస్తారు.. పగలంతా కష్టపడో.. డ్యూటీ చేసో అలసిపోయి సాయంత్రం ఇంటికి రాగానే ఫ్రేషప్ అయి టీవీల ముందు కూర్చుంటాము. లేదా చేతిలో మొబైల్ పట్టుకుని ఆపరేటింగ్ చేస్తాము.. ఆ తర్వాత డిన్నర్ టైం కి కాస్త తిని పడుకుంటాము.
ఐతే అలా చేయడం ఆరోగ్యానికి మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం చేయాలని వారు చెబుతున్నారు. తిన్న వెంటనే పడుకుంటే ఉబకాయం పెరుగుతుంది. ఆహారం సరిగా జీర్ణం కాదు.
కాపీ టీ తాగితే కడుపులో గ్యాస్ ,జీర్ణ సంబంధిత వ్యాధులకు దారి తీస్తుంది అని హెచ్చరిస్తున్నారు. మసాలాలు, మాంసాహారం కాకుండా తేలికగా జీర్ణమై అహారాలు తీసుకోవాలని వారు సూచిస్తున్నారు. అయితే భోజనం చేశాక ఖచ్చితంగా వందడుగులు వేయాల్సిందే అని అంటున్నారు.
