ఐపీఎల్ విన్నర్ కు ప్రైజ్ మనీ ఎంతో తెలుసా..?
ఈరోజు ఆదివారం రాత్రి ఏడున్నరకు తమిళనాడులోని చెన్నై వేదికగా సన్ రైజర్స్ ఆఫ్ హైదరాబాద్, కేకేఆర్ మధ్య ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది.
ఈ మ్యాచులో విజేతకు రూ.20 కోట్ల ప్రైజ్ మనీ, రన్నరప్ గా నిలిచిన జట్టుకు రూ.13 కోట్లు దక్కనున్నాయి.అయితే మరోవైపు ఈ సీజన్ లో వరుసగా 3, 4 స్థానాల్లో నిలిచిన జట్లకు రూ.7 కోట్లు, రూ.6.5 కోట్లు బీసీసీఐ అందజేయనుంది.
దీంతో పాటు ఆరెంజ్ క్యాప్ పర్పుల్ క్యాప్ విజేతలకు తలో రూ.15 లక్షలు, ‘ఎమర్జింగ్ ఫ్లేయర్ ఆఫ్ ది ఇయర్’కు రూ.20 లక్షలు, మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ కు రూ.12 లక్షలు దక్కనున్నాయి.