వెంకటేష్ బెస్ట్ ఫ్రెండ్ ఎవరో తెలుసా..?
సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఫ్యామిలీ స్టార్ హీరో.. విక్టరీ వెంకటేష్ తెలుగు సినిమా ప్రేక్షకుల ముందు జనవరి సంక్రాంతి పండుక్కి రాబోతున్నారు. ఈ నేపథ్యంలో ఆహా లో స్ట్రీమింగ్ అయ్యే ఆన్ స్టాపబుల్ షోలో హీరో వెంకటేష్ పాల్గోన్నారు.
ఈ షోలో బాలయ్య వెంకీని మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరని ప్రశ్నిస్తాడు. దీనికి బదులుగా వెంకీ సమాధానం ఇస్తూ నా సతీమణి నీరజ నే నాకు బెస్ట్ ఫ్రెండ్. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్ కావడంతో వేరేవాళ్ల అవసరం నాకు రాలేదు.
నాకు సమయం దొరికితే తనతో గడుపుతాను. అవసరమైతే బయటకు వెళ్తాను. అప్పుడప్పుడు నేను వంటింట్లో అనేక రకాల వంటలు వండటానికి ప్రయత్నం చేస్తాను. నాకు అవి బాగా నచ్చితాయని తెలిపారు.