సీఎం పేరు తెలియనోళ్ళు యాంకరింగ్ చేయద్దా..?
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి పేరు తెలియని వాళ్లు యాంకరింగ్ ఎలా చేస్తారని అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు చామల కిరణ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఇటీవల హైదరాబాద్ లో జరిగిన తెలుగు సమాఖ్య మహాసభల్లో ప్రముఖ నటుడు, యాంకర్ బాలాదిత్య ముఖ్యమంత్రి పేరును తప్పుగా చెప్పడంపై ఆయన మండిపడ్డారు.
ఎంపీ అయిన తానే ఏదైనా విషయం మాట్లాడాలంటే పేపర్ రాసుకుని జాగ్రత్తగా మాట్లాడతానని చెప్పారు. అలాంటిది ఒక యాంకర్ ఇలా చేయడమేంటని, దీని వెనుక ఏదైనా కుట్ర ఉండొచ్చని ఆయన తన అనుమానం వ్యక్తం చేశారు.