టీమిండియా సీక్రెట్ బయటపెట్టిన ద్రవిడ్
టీమిండియా మాజీ లెజండ్రీ ఆటగాడు.. మాజీ కెప్టెన్.. మాజీ హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ టీమిండియా అత్యంత శక్తివంతమైన జట్టుగా మారడానికి వెనక ఉన్న సీక్రెట్ ను బయట పెట్టారు. ఓ కార్యక్రమంలో ద్రావిడ్ మాట్లాడుతూ ” నేడు టీమిండితయా క్రికెట్ అత్యంత శక్తివంతమైన స్థాయికి చేరుకుంది.
దేశనలుమూలాల నుండి మంచి ప్రావీణ్యం ఉన్న ఆటగాళ్లు వెలుగులోకి రావడమే అందుకు ప్రధాన కారణం.. మేము ఆడే సమయంలో కేవలం ప్రధాన నగరాల నుండే క్రికెటర్లు వెలుగులోకి వచ్చేది. వాళ్ళే అంతర్జాతీయ క్రికెట్ లో టీమిండియా తరపున ఆడేవాళ్లు.
ఇప్పుడు అలా లేదు.దేశంలోని మారుమూల ప్రాంతం నుండి సైతం ఆటగాళ్లు వెలుగులోకి వస్తున్నారు. అప్పట్లో ఉన్న కానీ వాళ్లు పైకి వచ్చే మార్గం లేదు. ప్రస్తుతం దేశవాళీ క్రికెట్ అత్యంత బలంగా ఉంది.. టెక్నాలజీ అందుబాటులోకి రావడం వల్ల ఎక్కడ ఏ ఆటగాడు ఉన్న ఆ సంగతి వెలుగులోకి వస్తుంది అని ద్రవిడ్ తెలిపారు.