మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న బీజేపీ
దేశ వ్యాప్తంగా ఈ రోజు లోక్ సభ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుతో మొదలైన ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమైంది.
తెలంగాణలో ఉన్న పదిహేడు ఎంపీ స్థానాల ఓట్ల లెక్కింపులో పోస్టల్ బ్యాలెట్ లో బీజేపీ,కాంగ్రెస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు.
మల్కాజిగిరి పార్లమెంట్ నుండి బరిలోకి దిగిన బీజేపీ అభ్యర్థి..మాజీ మంత్రి ఈటల రాజేందర్ పోస్టల్ బ్యాలెట్ లో దూసుకెళ్తున్నారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధి ఎల్ బి నగర్ అసెంబ్లీ సెగ్మెట్ లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్ల తో ఆధిక్యంలో ఉన్నారు.
ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు
బీజేపీ :-8811
కాంగ్రెస్ :2581
బీఆర్ఎస్ :1418