నెల రోజులు బోనాల పండుగ
తెలంగాణ రాష్ట్రంలో ఈ సారి నెలరోజులపాటు బోనాల పండుగ నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.
అంతేకాకుండా బోనాల పండుగ సందర్భంగా ఆలయాలకు ఇచ్చే నిధులు పెంచనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు.
రాజధాని మహానగరం ‘హైదరాబాద్ పరిధిలో 2400కుపైగా ఆలయాలు ఉన్నాయి. వాటన్నింటికీ నిధుల సహాయం చేస్తాము.
అలాగే 28 ప్రముఖ ఆలయాలకు స్థానిక ప్రజాప్రతినిధులే పట్టు వస్త్రాలు సమర్పిస్తారు’ అని మంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు.