కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హారీష్ రావు ఫైర్
దేవరకొండలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూఈ ప్రభుత్వంలో బడిపంతుళ్లపై లాఠీ చార్జీలు.. బడుగు జీవులకు జూటా హామీలు.గతంలో ఉపాధ్యాయులపై లాఠీ చార్జీలు జరిపిన దాఖలా లేదు.
విధినిర్వహణలో ఉన్న ఉపాధ్యాయులపై లాఠీ జరపడాన్ని బీఆర్ఎస్ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాం.ఈ ప్రభుత్వ నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయాలను అందర్నీ మోసం చేసింది.
విద్యార్థులకు వందరోజుల్లోపల 5 లక్షల భరోసా కార్డు ఇస్తామని చెప్పి ఏ ఒక్క విద్యార్థికీ కార్డు ఇవ్వలేదు.అమ్మాయిలకు ఉచిత స్కూటీ ఇస్తామన్నారు. ఒక్కరికీ ఇవ్వలేదు.
నిరుద్యోగులకు నెలకు రూ. 4 వేలు ఇస్తామని చెప్పి ఆరునెలలైనా ఇవ్వలేదు. దీనిపై అసెంబ్లీలో మేం ప్రశ్నిస్తే అలాంటి హామీనే ఇవ్వలేదని డిప్యూటీ సీఎం భట్టి అన్నారు.భృతి ఇవ్వకపోవడం ఒక మోసమైతే హామీ ఇవ్వలేదని చెప్పడం మరో మోసం.
అధికారంలోకి రాగానే ఉద్యోగులకు పెండింగ్ లో ఉన్న మూడు డీఏలు ఇస్తామని చెప్పి ఇవ్వలేదు.ఇప్పుడు నాలుగో డీఏ కూడా పెండింగులో ఉంది. రిటైరైన ఉద్యోగులకు పింఛన్ బెనిఫిట్లను రెండు మూడు నెలలుగా ఆపేశారు.
రేవంత్ మార్చిలో క్యాబినెట్ మీటింగ్ పెట్టి డీఏ విడుదల చేస్తామని మోసం చేశారు.గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉద్యోగులు, నిరుద్యోగులు ప్రశ్నించే గొంతు అయిన రాకేశ్ రెడ్డి గెలిపించండి.
మోసం చేసిన కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పండి.రాకేశ్ రెడ్డిని గెలిపిస్తే పీఆర్సీ కోసం, నిరుద్యోగ సమస్యలపై
బీఆర్ఎస్ పోరాడుతుంది.ఒక్కో హామీపై చేతులెత్తేస్తూ వస్తున్న కాంగ్రెస్‌కు నిరుద్యోగులు ఓటుతో బుద్ధి చెప్పండి.
ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అటకెక్కించింది. దీంతో ప్రైవేట్ కాలేజీలు సిబ్బందికి నెలలుగా జీతాలివ్వడం లేదు. ప్రవేట్ కాలేజీల యాజమాన్యాలు కూడా కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి.రైతుల ధాన్యాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కొనడం లేదు. 30 రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నారు.
కేసీఆర్ పాలనలో రైతుల ముఖాల్లో చిరునవ్వు చూశాం. ఇప్పుడు కన్నీళ్లు చూస్తున్నాం.మా హయాంలో మూడు నాలుగు రోజుల్లో ధాన్యం కొని 48 గంటల్లో డబ్బులు చెల్లించాం.దొడ్డు వడ్లకు బోనస్ లేదని సీఎం చావు కబురు చల్లగా చెప్పాడు. ఓట్లు పడక ముందు ఈ మాట చెప్పివుంటే రైతులు కాంగ్రెస్ సంగతి చూసేవాళ్లు.
సన్నరకాలకే బోనస్ అని మీ మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలేదు?.బాండ్స్ పేపర్లు బౌన్స్ అయ్యాయి. కాంగ్రెస్ కు ఎన్నికల క్షేత్రంలో శిక్ష తప్పదు.కాంగ్రెస్ కు ఓటేయడమంటే ఆ పార్టీ అబద్ధాలను మోసాలను ఆమోదించడమే.బీజీపీ కూడా ప్రజలను మోసం చేస్తోంది. పదేళ్లలో 20 కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి ఇవ్వలేదు.రేవంత్ ప్రభుత్వం వచ్చాక ఒక్క నోటిఫికేషన్ అన్నా వచ్చిందా?.నోటిఫికేషన్ ఇచ్చి పరీక్షలు పెట్టి రిక్రూట్మెంట్ చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం.
2 లక్షల ఉద్యోగాలిస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగమూ ఇవ్వలేదు.కాంగ్రెస్ కు కనువిప్పు కలగాలంటే ప్రశ్నించే గొంతు అయిన రాకేశ్ రెడ్డి గెలిపించండి అని పిలుపునిచ్చారు..