మాజీ మంత్రి హారీష్ రావు వార్నింగ్..?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రివర్యులు…సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు వార్నింగ్ ఇచ్చారు.. రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని పిర్జాదీగూడ మున్సిపాలిటీలో బీఆర్ఎస్ కార్పోరేటర్లపై కాంగ్రెస్ నేతలు చేసిన దాడిని తీవ్రంగా ఖండించారు..ఈ సందర్భంగా ట్విట్టర్ వేదికగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందిస్తూ” పీర్జాదిగూడ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలాగైనాసరే అవిశ్వాస తీర్మానం నెగ్గాలని కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ మేయర్ జక్కా వెంకట్ రెడ్డి, కార్పొరేటర్లను కిడ్నాప్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు.
ఔటర్ రింగ్ రోడ్డుపై 20 కార్లతో వారిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారు.బీఆర్ఎస్ కార్పొరేటర్లపై జరుగుతున్న ఈ దాడిని బీఆర్ఎస్ పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం.
డీజీపీ, రాచకకొండ కమిషనర్ వెంటనే పీర్జాదిగూడ మేయర్ కార్పొరేటర్లకు భద్రత కల్పించాలి.ప్రజాస్వామిక బద్ధంగా ఎన్నికైన ప్రజాప్రతినిధులపై ఇలా దాడులకు పాల్పడడం గర్హనీయం.ఇలాంటి దాడులకు పాల్పడితే చూస్తూ ఊరుకోం అని వార్నింగ్ ఇచ్చారు.