నిమ్స్ లో గురుకుల విద్యార్థికి మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శ
కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న విద్యార్థిని శైలజ ఆరోగ్య పరిస్థితి విషమించిదనీ తెలుసుకొని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రాజీవ్ సాగర్, హుటాహుటిన నీమ్స్ ఆసుపత్రికి చేరుకుని శైలజ ఆరోగ్యం పరిస్థితి డాక్టర్ ను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియా మాట్లాడారు..కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లా వాంకిడి గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో కలుషితాహారం తిని అస్వస్థతకు గురై నిమ్స్‌లో జ్యోతి మహాలక్ష్మి చికిత్స పొంది కోలుకొని డిశ్చార్జ్ అయ్యారని, కానీ శైలజ అనే అమ్మాయి అడ్మిట్ అయినప్పటి నుంచి సీరియస్ కండిషన్ లో ఉంది కిడ్నీ సమస్యతో డయాలసిస్ పై ఉంది ఇదివరకే పలు సార్లు హరిష్ రావు గారు, మేము నీమ్స్ ఆసుపత్రికి వచ్చి చూసి డాక్టర్ తో సంబంధిత అధికారులతో మాట్లాడి ఆ అమ్మాయిని అన్ని రకాల చికిత్సను అందించాని కోరడం జరిగింది.
కానీ శైలజ పరిస్థితి చాలా సీరియస్ గా ఉందని, కిడ్నీలు పూర్తిగా పని చేయడం లేదని కండిషన్ సీరియస్ గా ఉందని, బాలిక శరీరం చికిత్సకు సహకరించడం లేదని, కృత్రిమ శ్వాస ఉంది.!ఎస్సీ విద్యార్థిని శైలజ చదువుకొని తన భవిష్యత్తు తీర్చి దిద్దుకుదామని ఎన్నో కలలు కన్న అభం శుభం తెలియని అమ్మాయి నిర్లక్ష్యంగా భోజనం వికటించి ఇలా కావడం వారి కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు..?ఇది పూర్తిగా ప్రభుత్వం హత్య అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి నిర్లక్ష్యం ఖరీదు 42 మంది విద్యార్థుల ప్రాణాలని మండిపడ్డారు.పురుగులన్నం తినలేక విద్యార్థులు ఆకలితో అలమటించినా పట్టించుకోడని, ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు ఆస్పత్రుల పాలైన పట్టించుకోడని, టీచర్లు కావాలంటూ విద్యార్థులు రోడ్డెక్కినా పట్టించుకోడని విమర్శించారు.!
రేవంత్ రెడ్డి తన మాట్లాడితే కెసిఆర్ మూలాలను తుడిచేస్తా అంటున్నాడు.. అందులోనే ఈ గురుకులాలను పట్టించుకోక పోవడం తో ఈ విద్యార్థుల పరిస్థితి ఇలా మారింది..!.రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కార్ ఘోరంగా విఫలం అయిందని గుర్తు చేశారు.. 11 నెలల కాంగ్రెస్ పాలనలో 42 మంది విద్యార్థులు ప్రభుత్వం నిర్లక్ష్యం తో ప్రాణాలు కోల్పోయారు. ఇంతకంటే దురదృష్టం లేదు.. ఇది పూర్తిగా ప్రభుత్వం నిర్లక్ష్యం తో జరిగింది ఇప్పటికైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, సంబంధించిన అధికారులు అన్ని విధాలుగా ఈ శైలజ కు న్యాయం జరిగేలా చూడాలని మాజీ మంత్రి కొప్పుల బిఆర్ఎస్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు