మాజీ మంత్రి కేటీఆర్ ను కల్సిన మంత్రి…?
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు గురువారం తెలంగాణ భవన్ లో జరిగిన బీఆర్ఎస్వీ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ” ఇటీవల నేను ఢిల్లీ పర్యటనకు వెళ్లాను. ఆ పర్యటనలో కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత.. మంత్రి నాకు ఒకరూ తారసపడ్డారు. నార్మల్ గా నేను కుశల ప్రశ్నలు అడిగాను..
గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలపై అడిగాను. అందుకు ఊకో రామన్న .. మేము ఊహించలేదు.. అధికారంలోకి రావాలని ఎడా పెడ హామీలిచ్చేశాము.. మా శ్రీధర్ బాబు రాసిందల్లా చదివాము.. ఎన్నికల్లో ఒకటి అనుకుంటే మరోకటి జరిగింది. మేము అధికారంలోకి వచ్చాము. తీరా ఇప్పుడవన్నీ ఆలోచిస్తే ఒకటి కాదు రెండు కాదు అవన్నీ నాలుగోందలయాబైకి పైగా అయినవి.
అవన్నీ అమలు చేస్తామా.. చస్తామా.. దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలని చూస్తున్నాము.. అందుకే అందినకాడికి దోచుకుంటున్నాము అని చెప్పారు. ఈ మ్యాటర్ ప్రజలకు చెప్పాల్నా అని నేను అంటే నా పేరు బయటకు చెప్పకు అని అన్నాడు అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.