కేసీఆర్ పై మాజీ ఎంపీ సంచలన ఆరోపణలు

Injustice to Medigadda due to blind hatred towards KCR!
తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుపై మాజీ ఎంపీ రవీంద్రనాయక్ సంచలన ఆరోపణలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” కేసీఆర్ ఉద్యమ ముసుగులో కోట్లాది రూపాయలను వెనకేసుకున్నారు.
ఉద్యమం పేరుతో అన్ని వర్గాల ప్రజలను.. నాయకులను.. యువతను మోసం చేశారు. ఆయన బాధితులు ఎంతోమంది ఉన్నారు. పార్టీ ఆవిర్భావ సభ్యుడిగా ఉన్న నన్ను తెలంగాణ భవన్ నుండి తరిమేశారు అని ఆరోపించారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఉద్యమ కారులను.. నాయకులను పక్కన పెట్టేశారు. ఉద్యమ ద్రోహులను పార్టీలోకి చేర్చుకుని వారికి పదవులిచ్చారు. ఉద్యమాలు చేసి తెలంగాణకోసం కోట్లాడినవాళ్లను కనీసం మనుషులుగా కూడా చూడలేదు.. పదేండ్లలో ఏనాడు కూడా అపాయింట్మెంట్ ఇవ్వలేదు. ఉద్యమ కారుల ఉసురు కేసీఆర్ కు తగులుతుందని శాపనార్ధాలు పెట్టారు.
